Tuesday, September 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకన్నపేగుకు కన్నీళ్లు

కన్నపేగుకు కన్నీళ్లు

- Advertisement -

కొడుకు పట్టించుకోవడం లేదని వృద్ధుడి ఆత్మహత్యాయత్నం ..
ప్రజావాణిలో ఘటన.. ఆస్పత్రికి తరలింపు


నవతెలంగాణ -రాజన్నసిరిసిల్ల
కడదాకా కనిపెట్టుకుని ఉండా ల్సిన కొడుకు, కోడలు ఆ వృద్ధ దంపతు లను ఇంట్లో నుంచి గెంటేశారు.. మళ్లీ ఇంటికి వస్తే చంపుతామని బెదిరించారు. దిక్కుతోచని వృద్ధ దంపతులు జిల్లా కలెక్టరేట్‌లోని ప్రజావాణికి వచ్చారు. కన్నీళ్లకు కరిగిపోని వ్యవస్థలో, కన్న పేగుకు విలువ ఇవ్వని తన కొడుకుకు బుద్ధి చెప్పండంటూ.. వృద్ధ తండ్రి పురుగుల మందు తాగి ఆత్మ హత్యాయత్నం చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం జరిగింది. రుద్రంగి మండలానికి చెందిన అజ్మీర విఠల్‌(65), అతని భార్య వీరవ్వ తమ కొడుకు నరేష్‌పై ఫిర్యాదు చేయడానికి జిల్లా కలెక్టరేట్‌లోని ప్రజావాణికి వచ్చారు. కొడుకు, కోడలు తమను పట్టించు కోవడం లేదని, ఇంట్లోంచి వెళ్లగొట్టి చంపుతామని బెదిరిస్తున్నారని అధికారు లకు ఫిర్యాదు చేశారు.
గతంలో పెద్దమనుషులు, పోలీసులు కూడా ఈ విష యంలో జోక్యం చేసుకున్నా, తమకు న్యాయం జరగలేదని వారు వాపోయారు.

ఈ క్రమం లోనే, తన బాధను వ్యక్తం చేయలేక, న్యాయం జరగదన్న నిస్సహాయతతో విఠల్‌ కలెక్టరేట్‌ కార్యాలయం ఆవరణలోనే పురుగుల మందు తాగి ఆత్మ హత్యాయత్నం చేసుకున్నాడు. కలెక్టరేట్‌ సిబ్బంది వెంటనే స్పందించి, విఠల్‌ ను సిరిసిల్ల ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తీవ్రతను గమనించిన కలెక్టర్‌ తన వాహనంలోనే ఆస్పత్రికి పంపించారు. ప్రస్తుతం విఠల్‌కు చికిత్స కొనసాగుతోంది. అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన అనంతరం విఠల్‌ భార్య వీరవ్వ మాట్లాడుతూ.. ‘మా కొడుకు నరేష్‌ మమ్మల్ని పోషించడం లేదు. కనీసం మాట్లాడటానికి కూడా ఇష్ట పడటం లేదు. మమ్మల్ని ఇంట్లోంచి వెళ్లగొట్టి, చంపుతామని బెదిరిస్తు న్నాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పెద్దమనుషుల, పోలీసుల సమక్షంలో పంచాయితీ పెట్టినా, సమస్య పరిష్కారం కాలేదని ఆమె వాపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -