నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ సామాజిక మాధ్యమం టిక్‌టాక్ అమెరికా కంపెని నియంత్రణలోకి వస్తుందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ సోమవారం ప్రకటించారు. చైనా ప్రతినిధులతో జరిగిన చర్చల్లో ఫ్రేమ్ వర్క్ ఒప్పందం కుదిరిందని, రెండు దేశాల ప్రతినిధులు వాణిజ్యపరమైన నిబంధనలకు అంగీకరించారని స్కాట్ తెలిపారు. అమెరికాలో టిక్‌టాక్ నిషేదానికి కారణమైన సమస్యలను పరిష్కరించే విదంగా చర్చలు జరిపామని, మరిన్ని విషయాలను త్వరలో తెలుపుతామన్నారు. చైనాపై 100% సుంకాలను విధించాలని ట్రంప్ యూరోపియన్ యూనియన్‌ను బెదిరించిన సంగతి తెలిసిందే.
మరోవైపు తన సోషల్ ట్రూత్‌లో ” అమెరికా యువతకు ఇష్టమైన సామాజిక మాద్యమంతో ఒప్పందం కుదిరింది. మీరు ఎంతో సంతోషంగా ఉంటారు ” అంటూ టిక్‌టాక్ పేరు ప్రస్తావించకుండా రాసుకొచ్చారు. ఈ డీల్ కోసం చైనా అధ్యక్షుడితో శుక్రవారం మాట్లాడతానని తెలిపారు. చైనా కంపెని బైట్‌డాన్స్‌కు చెందిన టిక్‌టాక్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు బిలియన్ల వినియోగదారులను కలిగివుంది. సోమవారం జరిగిన ఒప్పందంతో టిక్‌టాక్‌ని అమెరికాలో అనుమతించారు. దీంతో మిలియన్ల మంది అమెరికన్లకు ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 17 లోగా డీల్‌ను చైనా పూర్తిచేయకుంటే టిక్‌టాక్‌ను నిషేదిస్తామ ని అమెరికా అధికారులు స్పష్టం చేశారు.