- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్యపై ఎఫ్ఐఆర్‌ను 2016లో హైకోర్టు క్వాష్ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ దీనిపై CJI జస్టిస్ గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. సెప్టెంబర్ 22న తదుపరి విచారణ చేస్తామని వెల్లడించింది.
- Advertisement -