Tuesday, September 16, 2025
E-PAPER
Homeజిల్లాలుఎస్ఎఫ్ఐ పోరాటాల ఫలితమే ఫీజు రియింబ‌ర్సెమెంట్

ఎస్ఎఫ్ఐ పోరాటాల ఫలితమే ఫీజు రియింబ‌ర్సెమెంట్

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్: ఎస్ఎఫ్ఐ పోరాటాలతోనే రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్లా బకాయిలను విడుదల చేస్తాం అని హామీ ఇచ్చింద‌ని, ప్రభుత్వం త‌న హామీ విస్మరిస్తే పోరాటాలు ఉధృతం చేస్తామ‌ని ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి కారం చక్రి అన్నారు. ఈ మేరకు మంగళవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక నాందేవ్వాడ లోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కార్యదర్శి కారం చక్రి మాట్లాడుతూ.. అదే విధంగా 8148 కోట్ల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను దశల వారీగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మద్యకాలంలో మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి మరియు ఫీజు దీక్షలు చేశాం అని గుర్తు చేశారు.అదేవిధంగా ఫీజు రియిబ‌ర్స్ మెంట్‌లు, ఉప‌కార వేత‌నాలు విడుదల కాకపోవడంతో.. విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో నాణ్యతతో కూడిన భోజనాలు అందడం లేదని అన్నారు. అదేవిధంగా రెండు సంవత్సరాలు గడిచిన ఇప్పటికే విద్యా శాఖకు మంత్రిని కేటాయించకపోవడం దురదృష్టకరమని వెంటనే విద్యా శాఖకు మంత్రిని కేటాయించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, అక్షయ్ , మారుతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -