నవతెలంగాణ-జుక్కల్ : మండలంలోని కేమ్రాజ్ కల్లాలి మరియు ఖండేబల్లూర్ గ్రామాలలో జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ , ఎంపీ ఓ రాము మంగళవారం నాడు పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేమ్రాజ్ కలగాలి గ్రామంలో ఇందిరమ్మ పథకంలో గృహ నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్న లబ్ధిదారులకు వెనువెంటనే మూడు విడతలుగా బిల్లులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఇంటి నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. ఇష్టం వచ్చినట్టు ఇంటి నిర్మాణాలు చేపడితే అటువంటి నిర్మాణాలు చేస్తున్న లబ్ధిదారులకు బిల్లులు మంజూరు కావని తెలిపారు , తర్వాత ఇబ్బంది పడవద్దని అవగాహన పరిచారు.
జీపీ రికార్డులను పరిశీలించిన ఎంపీడీవో : కేంర్రాజ్ కల్లాలీ గ్రామంలోని గ్రామపంచాయతీ రికార్డులను ఎంపీడీవో శ్రీనివాస్ , ఎంపీ ఓ రాము పరిశీలించారు. జీపీ కార్యదర్శి నిత్యం గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి అందరితో కలిసి మెలిసి ఉండాలని సూచించారు. గ్రామంలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులకు గురి చేయవద్దని సమస్యలు ఉటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పి జీపీ కార్యదర్శి జీవన్ రాథోడ్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ తో పాటు ఎంపీ ఓ రాము , జిపి కార్యదర్శి , ఇందిరమ్మ గృహాలబ్ధిదారులు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీడీవో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES