Tuesday, September 16, 2025
E-PAPER
Homeజిల్లాలుయూరియా క్యూ లైన్‌లో బీరు సీసాలు, బకెట్లు

యూరియా క్యూ లైన్‌లో బీరు సీసాలు, బకెట్లు

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్‌: యూరియా కోసం రైతులు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. క్యూ లైన్‌లో పాస్ బుక్‌లు, చెప్పులతో పాటు బీరు సీసాలు, బకెట్లు, మగ్గులు క్యూ లైన్‌లో పెట్టడం దర్శనమిచ్చాయి. మంగళవారం మండలంలోని లక్ష్మీదేవునిపల్లి, అంతంపల్లి గ్రామ సొసైటీలో యూరియా వస్తుందని సమాచారంతో.. ఒక్కసారిగా రెండు గ్రామాల రైతులు యూరియా కోసం తెల్లవారుజామునే త‌ర‌లించారు. ఏ వస్తువు దొరుకుతే ఆ వస్తువును క్యూ లైన్ లో పెట్టారు. రెండు గ్రామాలకు కలిపి యూరియా తక్కువ రావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రైతులు మండిప‌డుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -