- ఇరిగేషన్ సీఏడి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో
నవతెలంగాణ-ఆర్మూర్: నీటిపారుదల శాఖ సిఏడి డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని సప్తగిరి కన్వెన్షన్‌లో పదోన్నతి బదిలీల సన్మానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణ నీటిపారుదల శాఖ ఎస్ఈ యశస్వి కామారెడ్డికి బదిలీ అయ్యారు, బి.రామారావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుండి సూపరింటెండెట్ ఆఫ్ ఇంజనీర్ గా నిజామాబాద్ కు పదోన్నతిపై బదిలీ కాగా, ఎం.డి.సాజిద్ అలీ సూపరింటెండెంట్ నుండి నాన్ టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్ గా బెల్లంపల్లికి పదోన్నతి బదిలీ అయ్యారు. లోక ప్రవీణ్ కుమార్ ఏఈఈ నుండి డీఈఈ గా పదోన్నతి బదిలీపై నిజాంసాగర్‌కు వెళ్లారు. వారి స్థానంలో మీర్జా నాజిర్ హుస్సేన్ ఎస్ ఈ,బి. పవన్ కుమార్ డిప్యూటీ ఎస్సీలకు స్వాగతం తెలుపుతూ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు భాను ప్రకాష్ ఎన్జీవోస్ నాయకులు కృష్ణమూర్తి, జాఫర్, శ్రీనివాస్, స్వామి,కమలాకర్,సురేష్లు మాట్లాడుతూ వరి సేవలను అభినందించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి రైతులకు ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా పేరు ప్రఖ్యాతలు గడించి,నాణ్యమైన నిర్మాణాలు చేపట్టాలని నేటి కార్యక్రమానికి వచ్చిన అసిస్టెంట్ ఇంజనీర్లు సీనియర్ల ద్వారా పనిని నేర్చుకోవాలని అంకితభావంతో పనిచేసి మన డిపార్ట్మెంట్‌కు మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఈలు కృష్ణమూర్తి,శ్రీకాంత్, రవి కుమార్, సర్కిల్ డివిజన్ స్టాఫ్, బాల్కొండ డివిజన్ ,ఆర్మూర్ సర్కిల్ నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.