Tuesday, September 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ సాయుధ పోరాటానికి అసలైన వారసులు కమ్యూనిస్టులే..

తెలంగాణ సాయుధ పోరాటానికి అసలైన వారసులు కమ్యూనిస్టులే..

- Advertisement -

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్..
నవతెలంగాణ – తిమ్మాజిపేట

వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులే అని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శ్రేణులు సాగించిన మట్టి మనుషుల మహా విప్లవం సాయిధ పోరాటం అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ లు అన్నారు. మంగళవారం సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యాలయం లక్ష్మణాచారి భవన్ లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు సాయుధ పోరాటాన్ని దాని అర్ధాన్ని మార్చేరకంగా బిజెపి ఇతర పార్టీలు ఎవరికి  వారు వాళ్ల అనుకూలంగా  మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఇది క్షమించరాని చర్యలని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు ఎవరో తెలంగాణలోని ప్రతి పల్లెను అందులో ఉన్న చెట్టును అడిగిన పుట్టనడిగిన చెబుతుందని అన్నారు.

తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఆలనాటి తెలంగాణ సాయుధ పోరాట జ్ఞాపకాలు నేటికీ సజీవంగా ఉన్నాయని అన్నారు. సాయితో పోరాటంలో ఒక చెమట చుక్క కూడా రాల్చని బిజెపి లాంటి పార్టీలు నేడు వితండవాదం చేస్తూ విలీనం దినం జరపమని కోరకపోగా విమోచన దినంగా దీని నిర్వహిస్తున్నారు. అసలు విమోచనమంటే అర్థం ఏమిటి ? బిజెపి వాళ్లకు తెల్సా అని వారు ప్రశ్నించారు. నిజానికి విమోచనమే జరిగితే 1948 సెప్టెంబర్ 17వ తేదీన ఆనాటి చివరి నిజమైన మీరుస్మానాలి కాని బంధించి జైల్లో పెట్టాలి కానీ భారత సైన్యం అతనికి గవర్నర్ హోదా ఇచ్చి కోట్లాది రూపాయల జీతం ఇచ్చి రాజ మర్యాదలన్నీ కల్పించడం జరిగింది. దీన్ని ఎలా విమోచన అంటారు. వాస్తవ చరిత్రను ప్రజలకు తెలియకుండా చేయడమే నేడు ఈ వాదనకు అసలైన కారణం అన్నారు. ఎవరు ఏమి చెప్పినా తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించి 4,500 మంది వీరులను తెలంగాణ విముక్తి కైస్వం ప్రాణ త్యాగం చేసిన పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంచిన వేలాది గ్రామాలు దేశ్ముకులు రజాకారులు త్వరలో భూస్వాముల కబంధ హస్తాల నుంచి విడిపించిన చరిత్ర అంతా ఎర్ర జెండాది సిపిఐదే అని తెలిపారు.

ఈ జిల్లాలోని అనేక మంది వీర యోధులు సాయత పోరాట ఉద్యమాన్ని తమ భుజాస్కాంతలపై వేసుకొని ఉమ్మడి మహబూబ్ నాగర్ అంతా విస్తృతంగా ఈ ఉద్యమాన్ని ఉదృతంగా నడిపించారని వారు గుర్తు చేశారు. సురవరం వెంకట్రాంరెడ్డి లక్ష్మణ చారి కటికినేని గోపాలరావు సిఆర్ శర్మ కమ్యూనిస్టు రంగమ్మ తప్ప పెరమల బాలయ్య మాసయ్యలు చిన్న లింగారెడ్డి పెదలింగారెడ్డి మహబూబ్నగర్ పట్టణానికి చెందిన అర్హతుల బేగ్ ఇలా అనేక మంది వీరులంతా నడిచింది ఎర్రజెండాలోనే అని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గడిచిన ప్రభుత్వాలు అన్ని తెలంగాణ సాయుధ పోరాటాన్ని అవమానపరిచేరకంగా ఎంఐఎం పార్టీ లాంటి నేతలకు సంతోష పెట్టడంలో భాగంగా సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించకపోవడం అత్యంత బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరువ చూపి ఇప్పటికైనా గోల్కొండ కోటపై విలీన దినోత్సవంగా సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

ప్రజలు ఈ చారిత్రాత్మక ఉద్యమ స్ఫూర్తితో తమ జీవితాల్లో సమాజంలో ఉన్న అసమాన తలపై అనేక సమస్యలపై పోరాటాలకు సన్సిధం కావాలని వారు పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను స్ఫూర్తిని కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిత్యం నేటి తరపు యువతి యువకుల్లోకి ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి శాయశక్తుల కృషి చేస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హెచ్ ఆనంద్ జి  కె కేశవులు గౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యులు  నరసింహ ఈర్ల చంద్రమౌళి కొమ్ము భరత్ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బిజ్జా శ్రీనివాస్ శంకర్ కాజా మైనద్దీన్ తదితరులు వున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -