Tuesday, September 16, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయండోనాల్డ్ ట్రంప్ తో సమావేశం కానున్న పాక్ ప్రధాని.?

డోనాల్డ్ ట్రంప్ తో సమావేశం కానున్న పాక్ ప్రధాని.?

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అమెరికా, పాకిస్థాన్ సంబంధాలు మరోసారి బలపడటానికి సంకేతంగా కనిపిస్తోంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా వచ్చే వారం సెప్టెంబర్ 25న ఈ ఉన్నత స్థాయి సమావేశం జరిగే అవకాశం ఉందని పాకిస్థాన్‌కు చెందిన ‘ఖైబర్ న్యూస్’ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది.

ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. పాకిస్థాన్‌లో సంభవించిన వరదలు, ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి తర్వాత నెలకొన్న పరిస్థితులు, భారత్-పాకిస్థాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కూడా వీరి చర్చల ఎజెండాలో ఉన్నాయని ఆ కథనం పేర్కొంది. అయితే, ఈ సమావేశం గురించి పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) గానీ, వాషింగ్టన్‌లోని పాక్ రాయబార కార్యాలయం గానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -