Tuesday, September 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మూత పడిన నాయకపు పల్లి పాఠశాల.!

మూత పడిన నాయకపు పల్లి పాఠశాల.!

- Advertisement -

విద్యార్థులు లేకున్నా…విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలం పెద్దతూండ్ల గ్రామపచాయితీ పరిదిలోగల నాయకపుపల్లి(కిషన్ రావుపల్లి)లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలో విద్యార్థులు లేకపోవడంతో మూతపడింది. 2025-26 విద్యా సంవత్సరంలో ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంతో పాఠశాల శునకాలతో దర్శనంమిస్తోంది. పాఠశాలలో విద్యార్థులు లేకున్నా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు విధులు నిర్వహిస్తోంది. పాఠశాల ఖాళీ కావడంతో ఇదే గ్రామంలో ఉన్న అంగన్ వాడి కేంద్రాన్నీ సిప్ట్ చేశారు. అంగన్ వాడికి సంబంధించిన సామగ్రి పాఠశాల భవనంలోకి సిప్ట్ చేశారు.కానీ చిన్నారులు ఎవరు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగళవారం నవతెలంగాణ పాఠశాలను పరిశీలించగా పాఠశాల అపరిశుభ్రత,పాఠశాల చుట్టూ చెత్త,చెదారంతో నిండిపోయి కనిపించింది.

రాత్రివేళల్లో పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారినట్లుగా ఖాళీ గ్లాసులు,మద్యంసీసాలు కనిపించాయి. విద్యార్థులు హాండ్ వాచ్ చేసుకోవడానికి బిగించిన నల్లాలు సైతం గతంలోనే మాయమైనట్లుగా స్థానిక ఉపాధ్యాయురాలు తెలిపింది. ఈ విషయంపై మండల ఎంఈఓ లక్ష్మన్ బాబును వివరణ కోరగా నాయకపుపల్లి పాఠశాలలో విద్యార్థులు లేని విషయం నిజమేన్నారు. దసరా సెలవుల తరువాత ఉపాధ్యాయురాలును మరో పాఠశాలకు డిప్టేషన్ పై పంపునట్లుగా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -