నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
గోపాలమిత్ర సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా గుండాల మండలం తుర్కలషాపురం గ్రామానికి చెందిన వంగూరి గోవింద్ ని మంగళవారం జరిగిన జిల్లా సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు వంగూరి గోవింద్ మాట్లాడుతూ తన పైన నమ్మకంతో అధ్యక్షులుగా నియమించినందుకు జిల్లా కార్యవర్గ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. గోపాలమిత్రల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పాటుపడుతానని అన్నారు. గౌరవ అధ్యక్షులుగా పోలిపాక రాములు, ఉపాధ్యక్షులుగా కదిరేని స్వామి, ప్రధాన కార్యదర్శి గా మెండే సతీష్, కోశాధికారిగా బండి కొమురయ్య, సహాయ కార్యదర్శి గా దర్శన్ మధు,ప్రచార కార్యదర్శి గా బాల నరసింహ ని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులుగా కృష్ణా,సురేందర్,బాలరాజు, శ్రీను, శ్రీశైలం లు పాల్గొన్నారు.
గోపాలమిత్ర యాదాద్రి జిల్లా అధ్యక్షులుగా వంగూరి గోవింద్ నియామకం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES