Wednesday, September 17, 2025
E-PAPER
Homeఖమ్మంపామాయిల్ గెలలు కనీసం మద్దతు ధర రూ.25 వేలు కల్పించాలి

పామాయిల్ గెలలు కనీసం మద్దతు ధర రూ.25 వేలు కల్పించాలి

- Advertisement -

– ఏఐకేఎస్ అధ్యక్షులు అశోక్ దావలే కు వినతి
– అఖిల్ భారత కిసాన్ సభ కు హాజరైన మహేశ్వరరెడ్డి,పుల్లయ్య లు 
నవతెలంగాణ – అశ్వారావుపేట

పామాయిల్ గెలలు టన్ను కనీస ధర రూ.25 వేలు ఉండేలా కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని అఖిలభారత కిసాన్ సభ జాతీయ అద్యక్ష కార్యదర్శులు అశోక్ రావాలే,విజ్జు కృష్ణ లకు తెలంగాణ ఆయిల్ ఫాం రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు తుంబూరు మహేశ్వర రెడ్డి,కొక్కెరపాటి పుల్లయ్య లు వినతిపత్రం అందించారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన సీపీఐ(ఎం) అనుబంధ అఖిల భారత కిసాన్( ఏఐకేఎస్) సభ    సదస్సు కు తెలంగాణ కార్యదర్శి సాగర్,శోభన్, బొంతు రాంబాబు,తెలంగాణ ఆయిల్ ఫాం రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు తుంబూరు మహేశ్వర రెడ్డి,కొక్కెరపాటి పుల్లయ్య లు హాజరు అయ్యారు. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర పామాయిల్ రైతుల సమస్యల చర్చించడం తో పాటు,మెమోరాండం అందజేసారు.

ఇందులో మద్దతు ధర  రు.25 వేలు ఉండాలని,ధర నిర్ణయంలో రైతు సంఘాల కు ప్రాతినిధ్యం కల్పించాలని,రాష్ట్ర వ్యాప్తంగా వంద్యత్వ( ఆఫ్ టెక్  )మొక్కల బాధిత రైతులకు నష్టపరిహారంగా విత్తనం కంపెనీ నుండి వసూలు చేయాలని,ఆయిల్ఫెడ్ ద్వారా ఆ నష్టపరిహారాన్ని  రైతులకు ఇప్పించాలని,ఐఐఓపీఆర్  పరిశోధన బ్రాంచ్ ను తెలంగాణ రాష్ట్రం లో  ఏర్పాటు  చెయ్యాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పి.జంగారెడ్డి,శ్రీనివాసులు,సోమయ్య,వెంకట్, చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -