Wednesday, September 17, 2025
E-PAPER
Homeమానవిదోసెలు వేసేటప్పుడు..

దోసెలు వేసేటప్పుడు..

- Advertisement -

దోసెలు వేసేటప్పుడు కొన్నిసార్లు అది పేనానికి అంటుకుపోతుంటుంది. కొన్ని సింపుల్‌ చిట్కాలు పాటిస్తే దోసె పాన్‌ నుంచి సూపర్‌ సాఫ్ట్‌గాపైకి వస్తుంది. అవేంటో చూద్దాం.
దోసె వేసే ముందు పెనాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. అంతకముందు వండిన దోసె అవశేషాలు ఉంటే.. వాటిని పూర్తిగా తొలగించి శుభ్రం చేయాలి. కొంతమంది దోసె పెనాన్ని స్పూన్‌తో రుద్దుతారు. ఇలా చేస్తే తవా పాడైపోయి.. దోసె బయటకు రాదు. అందువల్ల పెనాన్ని కాటన్‌ బట్టతో శుభ్రం చేయాలి.
పెనాన్ని శుభ్రం చేసిన తర్వాత.. బంగాళాదుంప లేదా ఉల్లిగడ్డ ముక్కతో బాగా రుద్దాలి. నూనె కూడా ఎక్కువగా వేయవద్దు. ఒకటి రెండు చుక్కలు సరిపోతాయి. ఆ కొంచెం నూనెతో పెనం మొత్తం రుద్దాలి. నూనె రాసుకున్న తర్వాత పిండిని పోసి గుండ్రంగా చేసుకోవాలి. తర్వాత పైన నూనె రాసి బంగారు రంగులోకి వచ్చేవరకూ కాల్చుకోవాలి.
చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. పిండిని ఫ్రిజ్‌ నుంచి తీసిన వెంటనే.. దోసెలు వేస్తారు. కానీ ఇలా చేయకూడదు. దోసె వేయటానికి 15 లేదా 20 నిమిషాల ముందు పిండిని ఫ్రిజ్‌ నుంచి తీసి బయటపెట్టాలి. ఇలా చేయడం వల్ల పిండి బాగా ఉడుకుతుంది. పెనానికి కూడా అంటుకోదు.
దోసె పిండిలో నీళ్లు ఎక్కువగా కలుపుకోకూడదు. పిండి పలచగా ఉన్నా కూడా పెనానికి అంటుకుంటుంది. అందువల్ల నీళ్లను చూసి పోసుకోవాలి. పిండి కాస్త గట్టిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే దోసె ఈజీగా వస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -