Wednesday, September 17, 2025
E-PAPER
Homeసినిమాగ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే?

గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే?

- Advertisement -

ఎస్‌విఎస్‌ ప్రొడక్షన్స్‌ శ్రీనిధి సినిమాస్‌ బ్యానర్స్‌ పై నరసింహ నంది రచన, దర్శకత్వంలో రానున్న చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. దైవ నరేష్‌ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్‌ నిర్మాతలు.
సదన్‌ హాసన్‌, విక్రమ్‌ జిత్‌, నరేష్‌ రాజు, వినరు బాబు హీరోలుగా, శ్రీలు దాసరి, అదితి మైకేల్‌, మోహన సిద్ధి హీరోయిన్లుగా నటించారు. మంగళవారం ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్‌ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ,’ఈ సినిమాలో ప్రతి పాత్ర మనకు పురాణాల నుండి ఏదో ఒక పాత్రను, వ్యక్తిత్వాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. మనుషుల వ్యక్తిత్వాలు, అలాగే మనిషి ఇతర ఆలోచనలన్నీ పాత్రల్లో ప్రతిబింబిస్తుంటాయి’ అని తెలిపారు. ‘ఇటువంటి సినిమా తీయడం అదష్టంగా భావిస్తున్నాను. కొంతమంది రాజకీయ నాయకులకు వెన్నులో వణుకు పుట్టించే సినిమాగా నిలిచిపోతుంది’ అని నిర్మాత దైవ నరేష్‌ గౌడ చెప్పారు. నిర్మాత పరిగి స్రవంతి మల్లిక్‌ మాట్లాడుతూ, ‘ఒక గ్రామంలో జరిగే కొన్ని వాస్తవ సంఘటనలను తీసుకొని, స్త్రీ శక్తి చూపిస్తూ చేసిన సినిమా. ఒక్కమాటలో చెప్పాలంటే గ్రామీణ రాజకీయాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తే ఎలా ఉంటుందనేదే మా చిత్రం’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -