అంకిత్ కొయ్య, నీలఖి జంటగా విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా తెరకెక్కించారు. జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఈ చిత్రం ఈనెల 19న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో కీలక పాత్రలు పోషించిన నరేష్, వాసుకి మంగళవారం మీడియాతో ముచ్చటించారు. నరేష్ మాట్లాడుతూ, ‘ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ రెండూ ఉన్న సినిమా ఇది. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. ఈ సినిమాలో ప్రస్తుత జనరేషన్ తమని తాము చూసుకుంటారు. ఈ సినిమా చూసి అమ్మాయిలకు వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చి, కంట్లో నీళ్లు రాకపోతే నన్ను అడగండి’ అని తెలిపారు. ‘ఈ కథ విన్నప్పుడు ఒక తల్లిగా నేను కనెక్ట్ అయ్యాను. ఒక తల్లికి, అమ్మాయికి ఉండాల్సిన అవగాహన, బాధ్యత ఉన్నాయి ఈ కథలో. అంకిత్ చాలా సెన్సిబుల్ యాక్టర్. ఈ సినిమా కథ ఇప్పటి జనరేషన్ అమ్మాయిల అందరి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా చూస్తే అమ్మాయిలు – వాళ్ళ తండ్రుల మధ్య ఉన్న సమస్యలు తీరిపోతాయి’ అని నటి వాసుకి చెప్పారు.