Wednesday, September 17, 2025
E-PAPER
Homeజాతీయంమాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు

మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు

- Advertisement -

నవతెలంగాణ–హైదరాబాద్‌: బూడిద మాఫియాకు వ్యతిరేకంగా … బుధవారం ఆందోళన చేపట్టిన వైసిపి నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ని పోలీసులు అరెస్టు చేయడంతో ఎన్‌టిఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. బూడిద డంపు వద్దకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని వైసీపీ డిమాండ్‌ చేసింది. అయితే పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. నలుగురికి మాత్రమే అనుమతినిచ్చారు. ఈ నేపథ్యంలో … ఈరోజు మూలపాడులో బూడిద డంపుకు వెళ్లకుండా జోగి రమేష్‌ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బూడిద రవాణా ద్వారా ఎమ్మెల్యే వసంత కఅష్ణ ప్రసాద్‌ అక్రమార్జన చేశారని జోగి రమేష్‌ ఆరోపిస్తున్నారు. అయితే.. జోగి రమేష్‌ వ్యాఖ్యలను వసంత కఅష్ణ ప్రసాద్‌ తీవ్రంగా ఖండించారు. దీంతో మూలపాడులో ఉద్రిక్తత ఏర్పడింది. ఈరోజు బూడిద డంపుకు వెళ్లడానికి వైసిపి సన్నద్ధమవ్వగా పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం నెలకొంది. ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తతల నడుమ మాజీ మంత్రి జోగి రమేష్‌, వారి అనుచరులను వైసిపి నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేసి విజయవాడ వైపు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -