నవతెలంగాణ-హైదరాబాద్: జీఎస్టీ 2.O స్థూలంగా మధ్య తరగతికి మేలు చేసే విధంగా రూపొందించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పేద, మధ్య తరగతి, రైతులు, MSMEలు, దేశానికి ఉపయోగమైన సెక్టార్స్ ను పిల్లర్స్ గా పెట్టుకుని జీఎస్టీ రూపకల్పన చేశామన్నారు. ఏపీలోని విశాఖపట్నంలో బుధవారం జీఎస్టీ సంస్కరణలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు.
12 శాతం ట్యాక్స్ విధానంలో ఉన్న 99 శాతం ప్రొడక్ట్స్ 5 శాతంలో కి వచ్చేస్తాయని కేంద్రమంత్రి నిర్మలా తెలిపింది. 2017కు ముందు జీఎస్టీ ట్యాక్స్ పేయర్లు 66 లక్షల మంది 1.51 లక్షల మందికి ఈ 8 ఏళ్లలో పెరిగారు.. గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని అక్షేపించినా వినియోగదారులకు అంతిమంగా మేలు జరుగుతుంది.. వన్ నేషన్- వన్ ట్యాక్స్ విధానానికి జీఎస్టీ కౌన్సిల్ ఫెడరల్ వ్యవస్థగా మారిందన్నారు.నవరాత్రులు ప్రారంభం నుంచే కొత్త జీఎస్టీ విధానం పని చేస్తుంది అని స్పష్టం చేశారు. విస్తృతమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు అమలు చేయడం జరుగుతుంది అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
జీఎస్టీ 2.0 తీసుకొస్తే ఎనిమిదేళ్లు ప్రజల నుంచి భారీగా పన్నులు వసూలు చేసినట్లు ఒప్పుకుంటున్నారా అని ప్రతిపక్షాలు మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పదేళ్లు జీఎస్టీని తీసుకురాకుండా కాలయాపన చేసిన యూపీఏ ప్రభుత్వానికి జీఎస్టీపై మాట్లాడే అర్హత లేదు అన్నారు.