నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామాలలో ఇండ్లు కూలిపోవడం జరిగింది. ఇల్లు కోల్పోయిన వారిని రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అధికారులు పరిశీలన చేసి 50 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. ఇల్లు కోల్పోయిన బాధితులకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పేదవారికి ఆదుకునేందుకు రెవెన్యూ శాఖ గుర్తించిన 50 మందికి కిట్లను బుధవారం నాడు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు. ఇండ్లు పడిపోయిన లబ్ధిదారులకు రెడ్ క్రాస్ సొసైటీ అందించిన కిట్లను బాన్సువాడ సబ్ కలెక్టర్ చేతుల మీదుగా ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చసిన కార్యక్రమంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎంపీడీ వో శ్రీనివాస్, ఎమ్మార్వో మారుతి , డిప్యూటీ తాహసిల్దార్ హేమలత, అరేయ్ రామ్ పటేల్, జిల్లా మరియు జుక్కల్ మండలం రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ చేతుల మీదుగా కిట్లు అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES