Wednesday, September 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయ సమైక్యదినంగా జరుపుకోవాలి జాతీయ సమైక్యతకు కట్టుబడి..

జాతీయ సమైక్యదినంగా జరుపుకోవాలి జాతీయ సమైక్యతకు కట్టుబడి..

- Advertisement -

-హైదరాబాద్ సంస్థానం విలీనం
– నిజాం నవాబు స్వయం ప్రతిపత్తితో 
– అభివృద్ధిలో సంస్థానం అగ్రభాగం
– మోడీ, చంద్రబాబుకు ఊడిగం చేస్తూ 
– తెలంగాణపై రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం
– మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ వనపర్తి :
సెప్టెంబర్17ను విమోచన దినోత్సవంగా కాకుండా జాతీయ సమైక్య దినోత్సవంగా నిర్వహించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. బి.ఆర్.ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ పథకాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎగరేసి జాతీయ సమైక్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నవాబు స్వయం ప్రతిపత్తితో పాలన చేశారని,  ఆయనది ఆధునిక దృక్పథం అని అన్నారు. 1948 సెప్టెంబర్17 న భారత యూనియన్ లో విలీనం చేసిన విధానాన్ని నాయకులకు, కార్యకర్తలకు సోదాహరణంగా వివరించారు. నిజాం నవాబు ప్రజల సంక్షేమ కోసం సాగునీటి ప్రాజెక్టులు,భూసంస్కరణలు, విద్య,వైద్యం,విశ్వవిద్యాలయాలు,రోడ్లు,రైల్వే,బస్ డిపోలు ఏర్పాటు చేశారని,ప్రత్యేక న్యాయ వ్యవస్థ కోసం హైకోర్ట్ నిర్మించారని తెలిపారు. మధ్య తరగతి ప్రాజెక్టులు కోయిల్ సాగర్, పాత రామన్ పాడు, డిండి, నిజాం సాగర్ నిర్మించి రైతులకు నూతన భూసార పరీక్షలు చేసి చక్కెర, పత్తి అధికంగా పండించారని వాటి కోసం నిజాం సుగర్ ఫ్యాక్టరీ, అజాం జాహి బట్టల మిల్లు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. 1946 నాటికి కమ్యూనిస్టుల ఆధ్వర్యములో ప్రజా పాలన కోసం తెలంగాణ సాయుధ పోరాటం ఉదృతంగా సాగిందని అటువంటి పరిస్థితిలో భారత యూనియన్ లో జాతీయ సమైక్యత కోసం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేశారని దీన్ని కొంతమంది నిజాంపై విష ప్రచారం చేసి విమోచన దినంగా జరుపుకుంటున్నారని మండిపడ్డారు. అనాటి నెహ్రూ ప్రభుత్వం నిజాం నవాబ్ ను రాజ్ ప్రముఖ్ గా నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. అభివృద్ధి పట్ల నిజాం నవాబుకు ఉన్న చిత్తశుద్ధి నేటి పాలకులలో లేదు అని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 10 శాతం పూర్తి కోసం త్వరలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. లంబాడీ జాతిపై కాంగ్రెస్ కుట్ర,  లంబాడీ సోదరుల సంక్షేమ కోసం కె.సి.ఆర్ కృషి చేశారన్నారు. లంబాడీ జాతిని ఆదివాసి(ఎస్.టి జాబితా) నుండి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఏం.ఎల్.ఏలు సుప్రీం కోర్టులో కేసు వేశారని రేవంత్ రెడ్డికి లంబాడి సోదరుల సంక్షేమానికి కట్టుబడి ఉంటే ఆ ముగ్గురు ఎం.ఎల్. ఏలను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కె.సి.ఆర్ బంజారాల కోసం ప్రత్యేక గ్రామ పంచాయతీలు, పోడు భూములకు పట్టాలు, గిరిజన గురుకులాలు,కళాశాలలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 19bలక్షల లంబాడీ రైతులకు రైతు బంధు ఇచ్చారన్నారు. కళ్యాణ లక్ష్మీ పథకం లంబాడీల స్పూర్తితో ఏర్పాటు చేశారని అన్నారు. నేడు రేవంత్ రెడ్డి కార్పొరేట్ సంస్థల కోసం గిరిజన సోదరులు భూములు గుంజుకుంటున్నారని ఆరోపించారు.లంబాడీ సోదరుల హక్కుల కోసం బి.ఆర్.ఎస్ పోరాడుతుందని భరోసా ఇచ్చారు.
       ఈ కార్యక్రమములో బి ఆర్ ఎస్ నాయకులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్, కురుమూర్తి యాదవ్, విజయ కుమార్, కృష్ణా నాయక్, వనం రాములు, బొల్లెద్దుల బాలరాజు, మాణిక్యం, సేనాపతి, కర్రెస్వామి, రాజశేఖర్, ఎస్.టి.సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్, జాతృ నాయక్, పీనా నాయక్, కృష్ణా నాయక్, సూర్యవంశం గిరి, జోహెబ్ హుస్సేన్, హేమంత్ ముదిరాజ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -