- Advertisement -
నవతెలంగాణ కాటారం : కాటారం మండలం ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను తేదీ 18న ఉదయం 11 గంటలకు స్టేషన్ ఆవరణలో వేలం ద్వారా విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. వేలంలో పాల్గొనదలచిన వారు వాహనం పొందిన మొత్తానికి 50 శాతం ముందస్తుగా చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని అదే రోజు పూర్తిగా చెల్లించవలసి ఉంటుంది. తుక్కు వాహనాలను కట్ చేసి మాత్రమే తీసుకెళ్లాలి. వాహనం పొందిన వారు జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ వేలం డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఆఫీసర్, భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
- Advertisement -