Wednesday, September 17, 2025
E-PAPER
Homeకరీంనగర్స్వస్త్ నారి సశక్తి పరివార్ అభియాన్ లో భాగంగా కంటి వైద్య శిబిరం..

స్వస్త్ నారి సశక్తి పరివార్ అభియాన్ లో భాగంగా కంటి వైద్య శిబిరం..

- Advertisement -

నవతెలంగాణ-వేములవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వస్త్ నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు బుధవారం వేములవాడ రూరల్ మండలంలోని హనుమాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ రత్నమాల పాల్గొని సుమారు 50 మంది రోగులను పరీక్షించి వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. ప్రోగ్రామ్‌లో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు వేములవాడ రూరల్, అర్బన్ మండలాల పరిధిలోని అన్ని సబ్ సెంటర్లలో ప్రతిరోజూ స్పెషలిస్టు వైద్యులచే వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ దివ్యశ్రీతో పాటు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -