నవతెలంగాణ వేములవాడ
విశ్వకర్మ జయంతి సందర్భంగా బుధవారం వేములవాడ పట్టణంలోని భగవంతు రావు నగర్‌లో పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రత్యేక అభివృద్ధి నిధి నుండి మంజూరైన రూ.6 లక్షల ప్రొసీడింగ్ కాపీని సంఘ సభ్యులకు ఆది శ్రీనివాస్ అందజేశారు. ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గిన్నెల శ్రీనివాస్, చందనం శ్రీను, పొలాస ఆదినారాయణ, మేడారం రవీందర్, పోలాస శంకరయ్య, శివ, ప్రసాద్, కనపర్తి సత్తయ్య, హనుమాన్లు, జ్ఞానేశ్వర్ చారి, చందనం ప్రసాద్, సత్యంతో పాటు తదితరులున్నారు.