- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, సనత్‌నగర్, కృష్ణానగర్, మియాపూర్, చందనాగర్, మాదాపూర్, రాయదుర్గం, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. యూసుఫ్‌గూడా కృష్ణానగర్ బి బ్లాక్‌లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో వాహనదారులు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాదాపూర్‌లో భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. అమీర్‌పేట, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
- Advertisement -