నవతెలంగాణ వేములవాడ రూరల్
వేములవాడ ప్రాజెక్టు పరిధిలో (చందుర్తి, బోయినపల్లి, ధర్మారం, రుద్రంగి, కోనరావుపేట, చెక్కపల్లి, కొదురుపాక్, నారాపెల్లి, వేములవాడ అర్బన్ సెక్టార్ పరిధిలోని బుధవారం అంగనవాడి టీచర్లకు మూడు రోజులపాటు “పోషణ్ భీ–పఠాయ్ భీ” శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సెప్టెంబర్ 15 నుండి 17 వరకు సాగిన ఈ శిక్షణలో ప్రాథమిక విద్యతో పాటు పిల్లల పోషణ, ఆరోగ్యం గురించి వివరించారు.
0-6 సంవత్సరాల పిల్లల పెరుగుదలను పర్యవేక్షించడం, తక్కువ బరువుతో ఉన్న పిల్లలను గుర్తించడం, హృదయపూర్వక ఫీడింగ్ అందించడం, ఆరోగ్య పరీక్షలు చేయించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే మొదటి 1000 రోజుల ప్రాముఖ్యత, సవజాత శిశువుల రక్షణ, ప్రతి నెల 4వ శనివారం నిర్వహించే ఈసీసీఈ (బాల్య సంరక్షణ, విద్యదినం) ప్రాముఖ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్షిరాజము, సిడిపిఓ సౌందర్య,పోషణ్ అభియాన్ అధికారి రాజకుమార్, సూపర్‌వైజర్లు సరిత, అంజమ్మ, తార, కనకమల, మమత, రుగలక్ష్మి, నిర్మల, అంగనవాడి టీచర్లు తోపాటు తదితరులు పాల్గొన్నారు.