Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలి.

విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలి.

- Advertisement -

– ఆర్టీఐ నాయకులు
నవతెలంగాణ-భూపాలపల్లి : ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్,కాటారం డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు రావాల్సిన రూ.8,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని కోరారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి లేకపోవడం సరికాదన్నారు.ఫీజు రీయింబర్స్మెంట్ సరైన సమాయానికి రాకపోడంతోఎంతో మంది పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు,కోటగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -