Thursday, September 18, 2025
E-PAPER
Homeసినిమాఅందమైన గ్రామీణ ప్రేమకథతో 'బ్యాండ్‌ మేళం'

అందమైన గ్రామీణ ప్రేమకథతో ‘బ్యాండ్‌ మేళం’

- Advertisement -

‘కోర్ట్‌’ చిత్రంలో హర్ష్‌ రోషన్‌, శ్రీదేవీ అపల్లా అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరోసారి ఈ ఇద్దరూ ఓ అందమైన ప్రేమ కథతో ఆడియెన్స్‌ ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. శివరాజు ప్రణవ్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మ్యాంగో మాస్‌ మీడియా ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. సంగీతం, ప్రేమ, భావోద్వేగాలు, మనోహరమైన కథతో ఈ మూవీని సతీష్‌ జవ్వాజీ తెరకెక్కిస్తున్నారు. బుధవారం మేకర్స్‌ అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ను టైటిల్‌ గ్లింప్స్‌తో ప్రకటించారు. ఈ చిత్రానికి ‘బ్యాండ్‌ మేళం’ అని టైటిల్‌ను పెట్టారు. ‘ఎవ్రీ బీట్‌ హ్యాజ్‌ యాన్‌ ఎమోషన్‌’ అనేది ఉప శీర్షిక. టైటిల్‌ గ్లింప్స్‌ను ఫస్ట్‌ బీట్‌ అంటూ రిలీజ్‌ చేశారు. తెలంగాణ యాసలో విజయ్‌ బుల్గానిన్‌ స్వరపరిచిన అందమైన ఓ జానపద గీతంతో గ్లింప్స్‌ ప్రారంభమైంది.

ఈ ఫస్ట్‌ బీట్‌లో యాదగిరి (హర్ష్‌ రోషన్‌) తన ప్రేయసి రాజమ్మ (శ్రీదేవి అపల్ల) కోసం ఇంట్లోకి వచ్చి వెతుకుతుంటాడు. వీరి మధ్య జరిగే సంభాషణ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక చివర్లో అయితే హార్ట్‌ టచింగ్‌ ఎమోషన్‌, మ్యూజిక్‌తో టైటిల్‌ గ్లింప్స్‌ అందరినీ కదిలించేలా ఉంది. ఈ టైటిల్‌ గ్లింప్స్‌ చూసిన తరువాత ఓ అందమైన గ్రామీణ ప్రేమకథను తెరపై చూడబోతోన్నామనే ఫీలింగ్‌ మాత్రం అందరిలోనూ కలిగింది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. రోషన్‌, శ్రీదేవి, సాయి కుమార్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ : మ్యాంగో మాస్‌ మీడియా, నిర్మాతలు : కావ్య, శ్రావ్య, సహ నిర్మాత : శివరాజు ప్రణవ్‌, రచయిత, దర్శకుడు : సతీష్‌ జవ్వాజీ, సంగీతం : విజయ్‌ బుల్గానిన్‌, స్క్రీన్‌ ప్లే, ఎడిటింగ్‌ : శివ ముప్పరాజు, డిఓపి : సతీష్‌ ముత్యాల, గీత రచయిత : చంద్రబోస్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ : శ్రీనివాస్‌ నార్ని.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -