Thursday, September 18, 2025
E-PAPER
Homeసినిమాప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే 'భద్రకాళి'

ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే ‘భద్రకాళి’

- Advertisement -

హీరో విజయ్‌ ఆంటోనీ ‘మార్గన్‌’ విజయం తర్వాత మరో పవర్‌ ఫుల్‌ ప్రాజెక్ట్‌ ‘భద్రకాళి’తో వస్తున్నారు. అరుణ్‌ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్‌ ఆంటోనీ ఫిల్మ్‌ కార్పొరేషన్‌, మీరా విజయ్‌ ఆంటోనీ సమర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌, రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియాతో కలిసి ఈనెల 19న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో విజయ్‌ ఆంటోనీ మీడియాతో మాట్లాడుతూ,’ఇదొక పొలిటికల్‌ థ్రిల్లర్‌. కరెంట్‌ పాలిటిక్స్‌ ఇందులో కోర్‌ ఎలిమెంట్‌. నేను పొలిటికల్‌ మీడియేటర్‌గా కనిపిస్తాను. రాజకీయాల్లో ఒక మీడియేటర్‌ పాత్ర ఎలా ఉంటుంది? ఒక పెద్ద పెద్ద స్కాంలో తన పాత్ర ఏమిటి? అనేది ఆడియన్స్‌కి న్యూ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. ఈ పాలిటిక్స్‌ ప్రతి ఒక్కరు రిలేట్‌ చేసుకునేలా ఉంటుంది. డైరెక్టర్‌ అరుణ్‌ ప్రభు దర్శకత్వంలో నా 25వ సినిమా రావడం ఆనందంగా ఉంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇది బిగ్గెస్ట్‌ మూవీ ఇది. ఆర్‌ఆర్‌ ఇందులో చాలా క్రూషియల్‌. అలాగే నాలుగు పాటలు ఉన్నాయి. ఆ నాలుగు కూడా సిచ్చువేషనల్‌ సాంగ్స్‌. సురేష్‌ నా గత చిత్రం ‘మార్గాన్‌’ని చాలా అద్భుతంగా రిలీజ్‌ చేశారు. ఆ సినిమా చాలా మంచి విజయాన్ని అందుకుంది. నిర్మాత రామాంజనేయులు, నేను మరోసారి సురేష్‌ ప్రొడక్షన్‌ వారితోనే జర్నీని కొనసాగించాలనుకున్నాం’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -