Thursday, September 18, 2025
E-PAPER
Homeహైదరాబాద్మాల ప్రజా ఫ్రంట్ చైర్మన్‌గా డా.మంచాల లింగస్వామి

మాల ప్రజా ఫ్రంట్ చైర్మన్‌గా డా.మంచాల లింగస్వామి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మాలల ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం, మాలలపై కొనసాగుతున్న అణిచివేతకు వ్యతిరేకంగా 20 ప్రజా సంఘాలతో కలిపి బుధవారం నాడు హైదరాబాద్‌లో మాల ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేశారు. మాల ప్రజా ఫ్రంట్ చైర్మన్‌గా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు డా.మంచాల లింగస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కన్వీనర్‌గా డి.సర్వయ్య,గౌరవ అధ్యక్షుడిగా రాజు ఉస్తాద్, అధ్యక్షుడిగా కరణం కిషన్, వర్కింగ్ చైర్మన్లుగా – అంగరి ప్రదీప్, మన్నే శ్రీధర్, పుణ్య భాను ప్రకాశ్, కోఆర్డినేటర్‌గా ఆవుల సుధీర్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్‌గా దాసరి విశాల్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మైసే నాందేవ్‌, ప్రధాన కార్యదర్శిగా బి. ప్రమోద్ కుమార్‌, గౌరవ సలహాదారులుగా మసాడే లక్ష్మీనారాయణ, ఏ.నవీన్, జి. శంకర్, ఎంగల యాదగిరి, నర్సింగ్ రావులను ఎన్నుకున్నారు…

అనంతరం ఫ్రంట్ చైర్మన్ డా.మంచాల లింగస్వామి మీడియాతో మాట్లాడుతూ “మాల జాతి ఆత్మగౌరవం కోసం,హరించివేయబడుతున్న హక్కుల సాధన కోసం, సామాజిక,ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో మాలలను బలోపేతం చేయడం కోసం, ఎస్సీ రిజర్వేషన్లను పరిరక్షించడం కోసం మాల ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ వల్ల, అందులోని రోస్టర్ పాయింట్ల వల్ల మాల, మాల ఉప కులాలకు జరిగిన తీవ్రమైన అన్యాయంపై పోరాడడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. డా.బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాల కోసం పోరాడుతున్న మాలలపై అన్ని రాజకీయ పార్టీలు కక్షగట్టుకొని, కుట్రలు చేస్తూ అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. వారి కుట్రలను తిప్పికొట్టి భవిష్యత్తులో వారికి మాలల సత్తా చూపిస్తామని హెచ్చరిస్తున్నా. మాలలు అధైర్యపడొద్దు. మాల మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, వివిధ రాజకీయ పార్టీల్లో పని చేస్తున్న మాల రాజకీయ నాయకులను ఐక్యం చేసి జాతిని జాగృతం చేయడానికి ఉద్యమాన్ని నిర్మిస్తాం. మాలలు అలుపెరుగని పోరాటాలకు సిద్ధం కావాలని” పిలుపునిచ్చారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -