Thursday, September 18, 2025
E-PAPER
Homeఆటలుసంక్షోభంలో వెయిట్‌లిఫ్టింగ్‌ సంఘం?

సంక్షోభంలో వెయిట్‌లిఫ్టింగ్‌ సంఘం?

- Advertisement -

చట్టవిరుద్ధ సంఘంపై సమగ్ర విచారణ జరపండి
క్రీడా మంత్రి వాకిటి శ్రీహరికి సాయిలు ఫిర్యాదు

హైదరాబాద్‌ : వెయిట్‌లిఫ్టింగ్‌తో సంబంధం లేని, తెలంగాణలో నివాసంలో ఉండని వ్యక్తుల కుట్రలు, కుతంత్రాలతో తెలంగాణ వెయిట్‌లిఫ్టింగ్‌ సంఘం (టిడబ్ల్యూఎల్‌ఏ) సంక్షోభంలో కూరుకుపోయిందని, నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో మాయాజాలం చేసి అసోసియేషన్‌ను కబ్జా చేశారని టిడబ్ల్యూఎల్‌ఏ అధ్యక్షుడు డి. సాయిలు వాపోయారు. వెయిట్‌లిఫ్టింగ్‌ సంఘంలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణకు విజిలెన్స్‌ దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరికి డి. సాయిలు ఇటీవల ఓ వినతి పత్రం అందజేశారు. శతి, వెంకటరమణ, హన్మంత్‌రాజ్‌లు వెయిట్‌లిఫ్టింగ్‌ సంఘం పేరిట కార్యక్రమాలు చేస్తున్నారని, హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే రాష్ట్రస్థాయి టోర్నమెంట్లు, జిల్లా సంఘాలకు గుర్తింపు తొలగింపు, కొత్తగా గుర్తింపు వంటివి చేస్తున్నారని మంత్రి దష్టికి తీసుకొచ్చారు. పోలీసు, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ సహా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను వెయిట్‌లిఫ్టింగ్‌ సంఘంలో సభ్యులుగా చూపిస్తున్నారని.. జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ సంఘం, శాట్జ్‌లోని ఓ అధికారి అండతో ఈ తతంగం నడిపిస్తున్నారని సాయిల్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ వెయిట్‌లిఫ్టింగ్‌ సంఘం పేరిట జరుగుతున్న అక్రమాలు, దోపిడిలపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని క్రీడాశాఖ మంత్రిని కోరినట్టు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.

ఆరోపణలు అవాస్తవం : వెయిట్‌లిఫ్టింగ్‌ సంఘంపై సాయిలు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని, సత్యదూరమని శతి తెలిపింది. ‘2024లో జాతీయ సమాఖ్య నియమించిన అడ్‌హాక్‌ కమిటీ పర్యవేక్షణలో జరిగిన ఎన్నికల్లో నూతన కార్యవర్గం ఏర్పాటైంది. జాతీయ, ఒలింపిక్‌ సంఘాల గుర్తింపుతోనే టోర్నమెంట్లు నిర్వహిస్తున్నాము. ఇటీవల జాతీయ సమాఖ్యలోనూ ఈసీ సభ్యురాలిగా ఎన్నికయ్యాను. అయినా, న్యాయస్థానం పరిధిలో ఉందని ఇప్పటివరకు స్పందించలేదు. త్వరలోనే పూర్తి ఆధారాలను బయటపెడతాను’ అని శతి తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -