Thursday, September 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలు‘కల్కి’ సీక్వెల్‌లో హీరోయిన్ మార్పు..!

‘కల్కి’ సీక్వెల్‌లో హీరోయిన్ మార్పు..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్రభాస్‌ హీరోగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఎడి దేశవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించింది. విజువల్స్‌, కథ, స్టార్‌ కాస్ట్‌ అన్నీ కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. సహజంగానే సీక్వెల్‌ పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం … ఈ సీక్వెల్‌లో హీరోయిన్‌ దీపికా పడుకొనే భాగం కాబోరని అధికారికంగా ప్రకటించారు. ప్రొడక్షన్‌ టీమ్‌ స్టేట్‌మెంట్‌లో … ” మేము జాగ్రత్తగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మొదటి భాగంలో దీపికా ఎంతో కష్టపడ్డారు. కానీ క్రియేటివ్‌గా మన భాగస్వామ్యం కొనసాగలేదు. కల్కి 2898 ఎడి లాంటి సినిమా పూర్తి అంకితభావాన్ని, సమయాన్ని డిమాండ్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టులకు మా శుభాకాంక్షలు ” అని పేర్కొన్నారు. ప్రజంట్‌ దీపిక ఒక బిడ్డకు తల్లి అయిన కారణంగా … షూటింగ్‌ టైమింగ్‌ లో మార్పులు చేశారు. కల్కి లాంటి పెద్ద ప్రాజెక్ట్‌ కి సమయంతో పని ఉండదు. కానీ దీపిక ఇలాంటి నిబంధనలు పెట్టుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ముందు జాగ్రత్తగా మూవీ టీం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు సీక్వెల్‌లో హీరోయిన్‌ ఎవరు అనే చర్చ మొదలైంది. అభిమానులు కొత్త హీరోయిన్‌ పేరును తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే యూనిట్‌ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక కల్కి 2898 ఎడి సీక్వెల్‌ ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జోరుగా సాగుతున్నాయి. మరింత భారీ స్థాయిలో, విస్తఅతమైన విజువల్స్‌తో ఈ సీక్వెల్‌ను నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించనున్నారని సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -