Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బిజేపి,కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ లో చేరిక

బిజేపి,కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ లో చేరిక

- Advertisement -

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిచిన మాజీ ఎమ్మెల్యే చల్లా 
నవతెలంగాణ -పరకాల :  పరకాల మండలం మల్లక్కపేట గ్రామానికి చెందిన బీజేపి, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు గులాబీ కండువా కప్పుకుని బిఆర్ఎస్ లో చేరారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో ఈ చేరికలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమంలో బీజేపి గ్రామ అధ్యక్షులు బండి ఉదయ్ కిరణ్, తాళ్ల ప్రదీప్, బూత్గు కమిటీ అధ్యక్షులు గురజాల శివరాజు, బొజ్జం శివ, కాంగ్రెస్ బూత్ కమిటీ అధ్యక్షుడు చెన్న రాజేందర్ తదితరులు తమ పార్టీలకు రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. కాంగ్రెస్ పాలనలో రైతులు యూరియా కోసం చెప్పులను క్యూ లైన్ లో పెట్టాల్సిన రోజు వచ్చిందని విమర్శించారు. పేద కుటుంబాల ఆడబిడ్డలకు వాగ్దానం చేసిన తులం బంగారం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు. 420 హామీలు, ఆరు గ్యారంటీలు ప్రజలకు నేరుగా మోసం చేశాయని ధర్మారెడ్డి తీవ్రంగా ఎద్దేవా చేశారు.

ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ వెళ్లి వివరిస్తూ బిఆర్ఎస్ బలోపేతానికి ఎక్కువ మంది కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మండల అధ్యక్షులు, మాజీ వైస్ ఎంపిపి చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచులు సుమాల శ్రీనివాస్, బయ్యా రాజేందర్, గ్రామ బిఆర్ఎస్ నాయకులు, యువజన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -