Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ 9వ అంగన్వాడి సెంటర్లో పోషణ మాసం

మద్నూర్ 9వ అంగన్వాడి సెంటర్లో పోషణ మాసం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
తినే ఆహారంలో చక్కెర మంచి నూనె వాడకం ఎంత తక్కువగా వాడితే అంత మంచిదని పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా గురువారం మద్నూర్ మండల కేంద్రంలోని తొమ్మిదవ అంగన్వాడి సెంటర్లో సూపర్వైజర్ కవిత గర్భిణీలకు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ పోషణ మాసం కార్యక్రమాలు సెప్టెంబర్ 17 వ తారీకు నుండి అక్టోబర్ 16వ తారీకు వరకు నిర్వహించబడతాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మద్నూర్ 9 వ సెంటర్లో  షెడ్యూల్లో భాగంగా గర్భిణీలకు బరువులు, ఎత్తులు, పిల్లలకు, బరువులు, ఎత్తులు, తీయడం జరిగింది.

అదేవిధంగా ఆహారంలో చక్కెర మరియు నూనె ను తక్కువగా ఉపయోగించాలని అవి ఎక్కువగా వాడటం వల్ల జరిగే నష్టాల గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో అంగన్వాడీ సూపర్వైజర్ కవిత  మాట్లాడుతూ.. ఈ విషయాలన్నీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ హెచ్ఎం జ్యోతి, ఉపాధ్యాయురాలు లక్ష్మీ , గర్భిణీలు బాలింతలు, తల్లులు, కిశోర బాలికలు, అంగన్వాడి టీచర్ చంపా బాయి, అంగన్వాడీ హెల్పర్ సంగీత, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -