Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పార్టీ నుంచి సస్పెండైన నాయకుడికి మార్కెట్ కమిటీ చైర్మన్ హెచ్చరిక

పార్టీ నుంచి సస్పెండైన నాయకుడికి మార్కెట్ కమిటీ చైర్మన్ హెచ్చరిక

- Advertisement -

ఏఎంసీ చైర్మన్ సౌజన్య రమేష్ హెచ్చరిక..
నవతెలంగాణ – మద్నూర్

2023, 24 సంవత్సరంలో నీవు ఏమి చేశావు ఏ పార్టీలో ఉన్నావో కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ కు అన్ని రకాలుగా తెలుసని, వేరే పార్టీలో పని చేస్తూ కాంగ్రెస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా చలామణి అవుతున్న సౌదాగర్ అరవిందుకు మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ హెచ్చరికలు జారీ చేశారు. గురువారం ఏఎంసీ కార్యాలయ ఆవరణంలో విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ .. పార్టీ నుండి సస్పెండ్ అయిన వాడివి ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా చెప్పుకుంటూ నియోజకవర్గం ప్రజలకు మోసం చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.

నిన్ను తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని అన్నారు. ఇకనుంచి అయినా జాగ్రత్తగా ఉండాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని తెలిపారు. ఇకనుంచి జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, మద్నూర్ మండల మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్, కాంగ్రెస్ నాయకులు విలాస్ గైక్వాడ్ ,ఇతర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -