నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల నూతన జర్నలిస్టుల సంఘానికి మండలంలో గల జర్నలిస్టులందరికీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సంతోష్ మేస్త్రి గురువారం తన ఇంటి వద్ద ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన కమిటీ అధ్యక్షులకు కమిటీ సభ్యులతో పాటు మండలంలో గల దాదాపు 20 మంది విలేకరులకు సంతోష్ మేస్త్రి ప్రత్యేకంగా శాలువాలతో సన్మానించారు. అనంతరం అల్పాహారాన్ని స్వీట్ తో అందజేశారు.
మండల జర్నలిస్టుల సంఘం నూతనంగా ఏర్పడగానే మొట్టమొదట సంతోష్ మేస్త్రి విలేకరులందరికీ ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం చేపట్టినందుకు నూతన కమిటీ అధ్యక్షులు హనుమాన్లు సందూర్ వార్ అలాగే కమిటీ సభ్యుల తరఫున మండల విలేకరులందరి తరఫున ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విలేకరులు అందరు కలిసి సంతోష్ మేస్త్రికి ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు కార్యవా ర్ బాలు, శివాజీ అప్ప, ఆకుల పండరి ,పాలేకర్ నాగేష్ గౌడ్, వీరుతో పాటు స్టేట్ కౌన్సిల్ మెంబర్ సంగయ్యప్ప ,సీనియర్ జర్నలిస్టులు ఆర్మూర్ వారు హనుమాన్లు, రఘు, నవనీత్, బాలు, శ్రీనివాస్, శ్రీధర్ ,సాయి, సుభాష్, కర్లవార్, తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టు సంఘానికి సంతోష్ మేస్త్రి ఆధ్వర్యంలో ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES