- Advertisement -
నవతెలంగాణ ఆర్మూర్
పట్టణంలోని వ్యవసాయ పంట పొలాలను గురువారం రుద్రూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం క్వాలిటీ సీడ్ ప్రోగ్రాం లో భాగంగా వరి వంగడాల పంట పొలాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు రైతులకు తగు సూచనలు ,సలహాలు ఇవ్వడం జరిగింది. వరి, మొక్కజొన్న ,పసుపు పంటలను సందర్శించినారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు రాకేష్ ,సాయి చరణ్, మండలం వ్యవసాయ అధికారి హరికృష్ణ, వ్యవసాయ విస్తీర్ణ అధికారి అనూష, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి , రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -