నవతెలంగాణ – కామారెడ్డి
సేవా పక్షం కార్యక్రమం లో భాగంగా బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమన్ని కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ మండల కేంద్రంలోనీ పాత హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో నిర్వహించారు. ఆలయం చుట్టూ పేరుకుపోయిన చెత్త, గడ్డినీ తొలగించి ఆలయం కడిగి ఈ శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ అధ్యక్షులు తోట బాలరాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేష్ పెరిక, బిజెపి మండల అధ్యక్షులు అనిల్, ఓబీసీ జిల్లా కార్యదర్శి రాజలింగం, ఓబీసీ మోర్చా కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు ఉప్పు లక్ష్మీపతి, బీజేవైఎం మండల అధ్యక్షుడు చెరుకూరి సత్యం, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సురేశ్ రెడ్డి , సీనియర్ నాయకులు పులగం రమేశ్, దేవేందర్ రెడ్డి, బిజెపి మండల ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డి, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు సురేశ్, బూత్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కట్ట వెంకన్న, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఓబీసీ మోర్చా కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES