Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో స్వాస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం మరియు సీజనల్ వ్యాధుల సందర్బంగా విద్యార్థిణి, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. డిప్యూటీ వైద్య,ఆరోగ్య శాఖ కార్యాలయము ఎల్లారెడ్డి డివిజన్ సామజిక అధికారి జి. ఠాగూర్ మరియు సబ్ యూనిట్ అధికారి పాశం గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ఆర్ బి యస్ కె  మొబైల్ హెల్త్ టీం గాంధారి  సహకారముతో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయడం జరిగింది.

ఈ క్యాంపులో (115) మంది విద్యార్థులకు రక్త హీనత టెస్ట్, జ్వరంతో బాధపడుతున్న ఇద్దరు విద్యార్థులకు ఆర్ డి టి కిట్ ద్వారా రక్త పరీక్షలు చేయడం జరిగింది. ముగ్గురు విద్యార్దలకు సామాన్య రుగ్మమతలకు చికిత్స చేయడం జరిగింది. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు తీసుకోవలసిన ముందస్తు నివారణ చర్యల మీద అవగాహనా కలిగించడం జరిగింది. ఈ కార్యక్రమములో పాఠశాల ప్రిన్సిపాల్  సురేష్ చంద్ర , ఆర్ బి యస్ కె టీం డాక్టర్ మొహమ్మద్ ఇస్టియానత్, డాక్టర్ గౌతమి, ఎమ్. ఎల్లేశం ఫార్మసిస్ట్, జయసుధ ఆరోగ్యకార్యకర్త, పాఠశాల స్టాఫ్ నర్స్ షబానా మరియు స్థానిక ఉపకేంద్రం ఆరోగ్య కార్యకర్తలు దేవి, సుశీల ఆశ కార్యకర్తలు వనిత, గంగమణి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -