నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలోని వీధులలో ఇటీవల కురిసిన వర్షానికి ఇల్లు కూలిపోయింది. సమాచారం అందుకున్న ఎంపీడీఓ శ్రీనివాస్ వెంటనే వెళ్ళి పరిశీలించారు. అదేవిధంగా ఇందిరమ్మ పథకంలో మంజూరైన ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసి నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గత రెండు మూడు రోజులకు మండలంలో భారీ వర్షాలు పడడంతో పాత ఇండ్లలో ఉంటున్న వారు సురక్షితమైన ఇండ్లలో ఉండాలని ఎంపీడీవో సూచించారు. అదేవిధంగా కొత్తగా నిర్మాణాలు చేస్తున్న వారు నిభందనలు ప్రకారం నిర్మించుకోవాలని సూచించారు. నిబంధనలను వెల్లంగిస్తే వాటికి బిల్లులు మంజూరు చేయడం జరగదని తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ తో పాటు జుక్కల్ గ్రామపంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్ , జూనియర్ అసిస్టెంట్ గల్కట్ వార్ రాజు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES