Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ కు 20 మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి 

జుక్కల్ కు 20 మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి 

- Advertisement -

– సజావుగా సాగిన యూరియా అమ్మకాలు..
– సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు..
నవతెలంగాణ – జుక్కల్ 

మండలంలోని గ్రామాలకు జుక్కల్ సొసైటీ ఆధ్వర్యంలో 20 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం గురువారం దిగుమతి చేసుకోవడం జరిగిందని మండల వ్యవసాయ అధికారిని మహేశ్వరి , సొసైటీ కార్యదర్శి బాబురావు  తెలిపారు. యూరియాను పంపిణీ చేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలన చేసి ఒక్కొక్క రైతులను ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు జరిగిన పంపిణీ కార్యక్రమంలో రైతుల సమయంనం కనిపించింది.

  ప్రతి ఒక్క రైతు నిరాడంబరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా యూరియాను తీసుకపోవడంతో మంచి పరిణామంగా కనిపించిందని రైతులు అన్నారు. జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర తన పోలీసు సిబ్బందితో పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో వ్యవసాయ అధికారుల సహకారం పూర్తిగా కనిపించింది. ఈ యూరియా  పంపిణీ కార్యక్రమం సజావుగా సాగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -