Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్యకర్త కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది

కార్యకర్త కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది

- Advertisement -

– దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ- రాయపోల్

బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వారి కుటుంబాలకు కష్టసుఖాలలో అండగా నిలబడుతుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం రాయపోల్ మండలం ఎల్కల్, అనాజీపూర్, తిమ్మక్ పల్లి గ్రామాలలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్కల్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు జాల రాజు కుమారుడు జాల హర్షిత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అనాజీపూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఎనుముల నర్సింహ రెడ్డి మాతృమూర్తి ఎనుముల లక్ష్మి, తిమ్మక్ పల్లి బీఆర్ఎస్ యువనాయకులు ఎంకొల్ల రాజు మాతృమూర్తి ఎంకొల్ల లక్ష్మి, అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువ కార్యకర్త ఉడిది శేఖర్ ఇటీవల మృతిచెందగా వీరి కుటుంబాలను పరామర్శించడం జరిగిందన్నారు.

వారి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అధైర్య పడవద్దని మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ  కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, ఏఎంసి మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుప్త, నియోజకవర్గం బీసీ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్, రైతుబంధు మండల మాజీ అధ్యక్షులు మున్నా, రాష్ట్ర యువజన విభాగం నాయకులు రాజీ రెడ్డి,నాయకులు ఇప్ప దయాకర్, వెంకట్ గౌడ్, రామచంద్రం గౌడ్, భార్గవ్, శ్రీధర్, మురళి గౌడ్, చింత కింది మంజూర్, గురు ప్రసాద్, లక్ష్మారెడ్డి, మహేష్,నందు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -