Thursday, September 18, 2025
E-PAPER
Homeఖమ్మంవిధుల్లో చేరుతున్న జీపీఓలు

విధుల్లో చేరుతున్న జీపీఓలు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
గత ప్రభుత్వం రద్దు చేసిన గ్రామ రెవిన్యూ వ్యవస్థను నేటి ప్రభుత్వం పునరుద్ధరించి గ్రామ పరిపాలన అధికారి గా రూపొందించింది. నూతనంగా ఉద్యోగం పొందిన జీపీఓ లు విధుల్లో చేరుతున్నారు. గతంలో అశ్వారావుపేట మండలంలో 19 రెవిన్యూ గ్రామాలను నేడు క్లస్టర్ గా మార్చి 14 క్లస్టర్ లు గా కుదించారు. ప్రస్తుతానికి అశ్వారావుపేట కు బి.జయరాం, నారంవారిగూడెం కు ఎస్. తిరుపతిరావు, అచ్యుతాపురం కు పొక్కిలి అన్వేష్, ఆసుపాక కు వి.వెంకటేశ్వరరావు, నందిపాడు కు ఎం.రాజు, గుమ్మడివల్లి కి డి.రాజేంద్రం, గుంటిమడుగు కు జి. వెంకటేశ్వర్లు, బచ్చువారిగూడెం కు పి. రామయ్య, నారాయణపురం కు కల్తి రమేష్, అనంతారం కు టీ.హరీష్,కావడిగుండ్ల కు ఎస్. వెంకటేశ్వర్లు విధుల్లో చేరాలని తహశీల్దార్ సీహెచ్వీ రామ్ క్రిష్ణ గురువారం తెలిపారు. మరో ముగ్గురు చేరాల్సి ఉంది అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -