-డాక్టర్ మహేందర్ రెడ్డి
– ప్రాణరక్షణలో సిపీఆర్ కీలకం
నవతెలంగాణ – రాయికల్
పట్టణంలోని చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ భవనంలో ప్రతిమ ఫౌండేషన్, జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత ఉపాధి శిక్షణలో భాగంగా కరీంనగర్ నగునూర్ ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనస్తీషియా నిపుణులు డాక్టర్ మహేందర్ రెడ్డి సిపీఆర్ పై అవగాహన కల్పించారు. సడెన్ కార్డియాక్ అరెస్ట్ సమయంలో సిపీఆర్ ప్రాణరక్షణలో కీలకమని, ప్రతి ఒక్కరూ ఈ నైపుణ్యం నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మానికిన్ సహాయంతో ప్రత్యక్ష ప్రదర్శన చేసి, యువతకు ప్రాక్టీస్ చేసే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రతిమ ఫౌండేషన్ మేనేజర్ వంగ గీతారెడ్డి, జిఎంఆర్ ఫౌండేషన్ ప్రిన్సిపల్ మహేష్, ఫౌండేషన్ ఆర్గనైజర్లు రఘుపతి, శ్యామల, శిక్షకులు ప్రమోద్, నాగేందర్, చిరంజీవి, కృష్ణవేణి, శిక్షణార్థులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ సిపీఆర్ పై అవగాహన కలిగి ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES