Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దళిత కళాకారులకు డప్పుల పంపిణీ 

దళిత కళాకారులకు డప్పుల పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
దళిత కళాకారులను ప్రోత్సహించేందుకు 60 మంది కళాకారులకు డప్పులను పంపిణీ చేశామని తోరూర్ సొసైటీ మాజీ చైర్మన్ కూస భాస్కర్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఈరవెన్ను గ్రామానికి చెందిన 60 మంది దళిత కళాకారులకు కూస కొమరయ్య జ్ఞాపకార్థం కూస భాస్కర్ రెడ్డి ఉచితంగా డప్పులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కొమురయ్య దళితులకు అత్యంత సన్నిహితుడుగా పనిచేశాడని తెలిపారు.

ప్రతి కార్యక్రమానికి డబ్బులు అవసరం ఉంటాయని ఉద్దేశంతో కొమరయ్య ప్రజల్లో గుర్తుండే విధంగా డప్పులను పంపిణీ చేశామని తెలిపారు. కొమురయ్య జ్ఞాపకార్థం డబ్బులను పంపిణీ చేయడం పట్ల దళితులు భాస్కర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బిర్రు సోమేశ్వర్, ఐలమ్మ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోనె అశోక్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సింగిరెడ్డి బుచ్చమ్మ సత్తిరడ్డి, ఐలమ్మ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముస్కు రాంబాబు, నాయకులు గోనె మహేందర్ రెడ్డి, ముస్కు ఉప్పలయ్య, పకొడిశాల యాదగిరి, దాదరి ఉపేందర్, గాదరి సోమయ్య లతోపాటు కొమురయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -