- Advertisement -
నవతెలంగాణ – సారంగాపూర్
మండలకేంద్రంలోని ప్రభుత్వ జానియర్ కళాశాలను గురువారం జిల్లా మాధ్యమిక విద్యాధికారి పరుశురాం సందర్శించారు. ఆనంతరం తరగతి గదులలోనీ విద్యార్థులతో మాట్లాడారు. ఈ సంవత్సరం నుండి ముఖ గుర్తింపు హాజరు ఉంటుందని కాబట్ట ప్రతి విద్యార్థి ప్రతిరోజు క్రమం తప్పకుండా కళాశాలకు రావాలన్నారు. మంచిగా చదువు కుంటినే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం అధ్యాపకులతో సమావేశం ఏర్పాటుచేసి సకాలంల సిలబస్ పూర్తి చేస్తూ చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ డి. శ్రీనివాస్ కళాశాల అధ్యాపకులు సిబ్బంది ఉన్నారు.
- Advertisement -