Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేజీబీవీలో తాగునీటి నివారణకు చర్యలు

కేజీబీవీలో తాగునీటి నివారణకు చర్యలు

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ
మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో తాగునీటి నివారణకు చర్యలు తీసుకొంటున్నట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండె వెంకట్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జమ్మికింది బలరాం గౌడ్ అన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సహాకారంతో కేజీబీవీ పాఠశాలలో నూతన బోరు డ్రిల్లింగ్ పనులను గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి సమస్య ఉండడంతో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వం శ్రీకృష్ణ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయడంతో నూతనంగా బోరు వేయించడం జరిగిందని అన్నారు.

దీంతో పాఠశాల విద్యార్థులకు తాగునీటి సమస్య తీరిందని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఎస్వో మంజుల, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ ప్రసిడెంట్ గణేష్ గౌడ్, ఎన్ఎస్ఈయూఐ మండల అధ్యక్షుడు గోరేటి శివ, మండల వర్కింగ్ ప్రసిడెంట్ పానుగంటి అంజయ్య, నాయకులు గుండె శివగౌడ్, కందికంటి శ్రీనయ్యగౌడ్, గుండె రామకృష్ణగౌడ్, సాయికృష్ణగౌడ్, సుంకరి రామకృష్ణగౌడ్, పాఠశాల టీచర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -