నవతెలంగాణ-పాలకుర్తి
మండలంలోని చెన్నూరు ఉన్నత పాఠశాల కోకో క్రీడాకారులకు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు పల్లంకొండ ఉమారాణి కోకో కిట్స్ ను బహుకరించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పుష్కూరి రమేష్ రావు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ కోకో క్రీడాకారులను ప్రోత్సహించాలని లక్ష్యంతో వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు కోకో కిట్స్ ను బహూకరించాలని తెలిపారు. క్రీడాకారులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగలని, విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. పాఠశాలలోని క్రీడాకారులకు క్రికెట్ కిట్స్ ను బహుకరించిన ఉపాధ్యాయురాలు ఉమారాణిని ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు క్రాంతి కుమార్, శ్రీనివాస్, శోభ, శ్రీహరి, శ్రీష్మ, రాణి,మేరీ, ప్రతిభ, వకుళ, వెంకటేష్, అశోక్, వరలక్ష్మి, చైతన్య , స్వప్న తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులకు కోకో కిట్స్ బహుకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES