– ఐసిడిఎస్ భీంగల్ ప్రాజెక్టు ఏసిడిపివో జ్ఞానేశ్వరీ
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మూడు రోజులపాటు నిర్వహించిన శిక్షణ తరగతులు అంగన్ వాడి టీచర్లకు ఎంతో ఉపయోగపడతాయని ఐసిడిఎస్ భీంగల్ ప్రాజెక్టు ఏసిడిపివో జ్ఞానేశ్వరీ అన్నారు. ఐసిడిఎస్ భీంగల్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కమ్మర్ పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల మూడు మండలాలకు చెందిన అంగన్ వాడి టీచర్లకు పోషణ్ బి పడాయి బి కార్యక్రమంపై నిర్వహించిన శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణ తరగతులను ఐసిడిఎస్ భీంగల్ ప్రాజెక్టు ఏసిడిపివో జ్ఞానేశ్వరీ పర్యవేక్షించారు.
ముగింపు కార్యక్రమం సందర్భంగా ఆమె మాట్లాడుతూ 0-6 సంవత్సరాల పిల్లల మానసిక, శారీరక సాంఘికాభివృద్ధి, మేధో శక్తి, చురుకుదనం లాంటి ఎన్నో విషయాలను ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా అంగన్వాడి టీచర్లకు ప్రొజెక్టర్ ద్వారా వివరించడం జరిగిందన్నారు. మూడు రోజుల శిక్షణలో భాగంగా నేర్చుకున్న అంశాలను అంగన్ వాడి కేంద్రాలకు విచ్చేసే చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు నేర్పడం జరుగుతుందని, ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.
పోషణ, నవ చైతన్య, ఆదర్శ శీల తదితర అంశాలపై అంగన్వాడి టీచర్లకు ప్రొజెక్టర్ ద్వారా వివరిస్తూ అవగాహన కల్పించారు.కార్యక్రమంలో ఐసిడిఎస్ కమ్మర్ పల్లి మండల పర్యవేక్షకురాలు గంగ హంస, మోర్తాడ్ మండల పర్యవేక్షకురాలు మంజుల, ఏర్గట్ల మండల పర్యవేక్షకురాలు సరస్వతి, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దేవగంగు, భీంగల్ ప్రాజెక్టు ఉపాధ్యక్షురాలు యమున, మండల అధ్యక్షురాలు మంజుల, మూడు మండలాల అంగన్ వాడి టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.