Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం 

లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం 

- Advertisement -

ప్రధానోపాధ్యాయుడు భీమా నాయక్ 
నవతెలంగాణ – పెద్దవంగర

ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని అవుతాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బానోత్ భీమా నాయక్ అన్నారు. లయన్స్ క్లబ్ తొర్రూరు ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ దంపతులు లయన్ చంద్రశేఖర్ ఆర్య-రాజేశ్వరి పుట్టిన రోజు ను పురస్కరించుకుని పాఠశాలకు రూ. 18 వేల విలువచేసే మైక్ సెట్ బహుకరించారు. అనంతరం లయన్స్ క్లబ్ సెక్రటరీ రవీందర్ తో కలిసి ఆయన మాట్లాడుతూ.. ఎక్కడ ఏ అవసరం ఉందో వెంటనే గుర్తించి, అక్కడ సేవా చేయడం లయన్స్ క్లబ్ ప్రత్యేకత అని పేర్కొన్నారు.

పేద విద్యార్థుల ఉన్నతికి లయన్స్ క్లబ్ ముందుకు రావడం ప్రశంసానీయం అన్నారు. దాతలు అందిస్తున్న సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని, పట్టుదలతో చదువుకోవాలన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులకు హెచ్ఎం కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ట్రెజరర్ లయన్ శ్రీను, జాయింట్ సెక్రటరీ లయన్ శంకర్, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు గంగిశెట్టి రమేష్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు చిరంజీవి, ప్రతిభ, రజిత, అంగన్వాడీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -