బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. హీరో సాయి దుర్గతేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాబీ, వశిష్ట, అనుదీప్ అతిథులుగా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. హీరో సాయి దుర్గతేజ్ మాట్లాడుతూ,’ఈ సినిమా సక్సెస్ మొత్తం ఇండిస్టీ సక్సెస్. ఇండిస్టీ ఒక ఎవల్యూషన్ దశలో ఉంది. మంచి కథలు రావాలి. ఆడియన్స్‌ని ఎగ్జైట్ చేేసే కథలు రావాలి. అలా వస్తేనే ఆడియన్స్ థియేటర్లకి వస్తారు. అలాంటి సినిమాలు ఇవ్వడం మనందరి బాధ్యత. ‘లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిస్కింధపురి..’ ఇలా అన్ని సినిమాలు అద్భుతంగా ఆడుతున్నాయి.
ఇంత మంచి హిట్ అందుకున్న ‘కిష్కింధపురి’ టీమ్ అందరికీ కంగ్రాట్స్’ అని తెలిపారు. ‘ప్రేక్షకులు ఈ సినిమాని గొప్పగా ఆదరించి, ఇంత పెద్ద హిట్ చేసినందుకు కతజ్ఞతలు. ఈ సినిమాని థియేటర్స్‌లోనే చూడాలి. మీకు నచ్చితే ఇంకో పది మందికి చెప్పండి’ అని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ,’సాహుకి మాట ఇచ్చినట్టు ఈ సినిమా చూశాను. చాలా చోట్ల భయపడ్డాను. కొన్ని సీక్వెన్స్‌లో థియేటర్స్ మొత్తం షేక్ అయింది. అందరూ భయపడ్డారు. ఈ సెప్టెంబర్ ఒక విజయవంతమైన సెప్టెంబర్ అయింది’ అని తెలిపారు. డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ, ‘కౌశిక్ సినిమా బ్లాక్ బస్టర్ అవడం చాలా ఆనందంగా ఉంది. హీరో, నిర్మాతల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు . హర్రర్‌తో పాటు మంచి మెసేజ్‌ని పెట్టడం చాలా బాగా అనిపించింది’ అని అన్నారు.
‘కిష్కింధపురి’ సక్సెస్ ఇండిస్టీది..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES