వచ్చేవారం యూఎన్‌జీఏ కీలక సమావేశాలు
ప్రాధాన్యతలను వివరించిన అధ్యక్షురాలు అనలీనా
ఐక్యరాజ్య సమితి : సంస్కరణల ఎజెండాను ముందుకు తీసుకెళ్ళడం, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఎన్నిక, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ)ను సాధించడం వంటి అంశాలపై ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) 80వ సమావేశం దృష్టి కేంద్రీకరించనుందని యూఎన్‌జీఏ అధ్యక్షురాలు అనలీనా బార్‌బక్ బుధవారం చెప్పారు. ”నేడు మనం ఎదుర్కొంటున్న సవాళ్ళను ఏ ఒక్క దేశమూ పెద్దదైనా, చిన్నదైనా, నిరుపేద దేశమైనా, సంపన్న దేశమైనా విడిగా ఎదుర్కొనలేదని బార్‌బక్ స్పష్టం చేశారు. ‘కలిసి వుంటే కలదు సుఖం’ అనే థీమ్‌తో ఈ 80వ సమావేశాలు జరగనున్నాయని ఆమె పత్రికా సమావేశంలో తెలిపారు. వచ్చే వారం ప్రారంభం కానున్న సమావేశాల వివరాలను తెలియచేసేందుకు ఆమె పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. మనందరం కలిసి కట్టుగా కృషి చేయాలని ఆమె నొక్కి చెప్పారు. వాతావరణ మార్పులు, అసమానలు, వేగంగా మారిపోతున్న సాంకేతిక చొరవలు వంటి సమిష్టి సవాళ్ళపై అర్ధవంతమైన కార్యాచరణతో ముందుకు సాగడం, అలాగే గాజా, ఉక్రెయిన్, సూడాన్, హైతీల్లో శాంతి నెలకొల్పడం వంటి కీలకమైన అంశాలపై కలిసి పనిచేసి ఫలితాలు సాధించాలని ఆమె కోరారు.
మరో 80ఏండఅళ పాటు ఐక్యరాజ్య సమితి పటిష్టంగా పనిచేసేలా చూడడం మన తక్షణ కర్తవ్యమని ఆమె వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి 80వ వార్షికోత్సవాల సందర్భంగా సమావేశం, పాలస్తీనాకు శాంతియుత పరిష్కారం, రెండు దేశాల ఏర్పాటుపై సదస్సు, అలాగే మహిళలపై, యువతపై ప్రపంచ కార్యాచరణ కార్యక్రమాల 30వ వార్షికోత్సవాల సందర్భంగా ఉన్నత స్థాయి సమావేశాలతో వచ్చే వారమంతా బిజీ బిజీగా సాగనుంది. ఎనిమిది దశాబ్దాల పురోగతి, ఎదురుదెబ్బలు, వైఫల్యాలు, తీర్మానాలు, కృతనిశ్చయాలు వంటివన్నీ కలిసి మనల్ని ఇక్కడకు తీసుకువచ్చాయని ఆమె పేర్కొన్నారు. ”మన సంకల్పం, ఆశయాలు అన్నీ కార్యాచరణ రూపంలోకి మారాలి, పురోగతి పట్ల నిబద్ధతతో వుండాలి” అని ఆమె పేర్కొన్నారు.
సవాళ్ళను కలిసి ఎదుర్కొందాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES